Wednesday, May 27, 2009

గమనిక

తెలుగు లో నాకు అతిగ నచ్చే పదాలల్లో హాస్యం, వ్యంగ్యం, తర్కం, లౌకికం అనబడే ఈ 4 పదాలు...మొదటి 10 స్థానాల్లో ఏదో ఒక స్థానం కోసం సంతోషంగా కొట్టుకుంటుంటాయి. కావున నేను రాసే ఏ బ్లొగ్ అయిన, ఈ నాలుగు రసాలు భేషుగ్గా కనిపిస్తాయి. ఇవి ఎవరినన్న ఉద్దెసించి రాసినవి అని అనుమానం వస్తే… చాల మంచిది. కచ్ఛితంగా ఒకరిని ఉద్దేశించి రాసినవే…అయిన..." All characters and any resemblances are definitely NOT fictitious"...అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే...వెవ్ వెవ్ వెవ్...నాకు తెలీదు కనుక. ..!!

ఇందుకు నిదర్శనగా "KANDHIREEGA" అనబడే ఈ బ్లొగ్ కు
శ్రీకారం చుట్టినాను . ఇక కుట్టించుకోవడమే ఆలస్యం.............

వి..!

Tuesday, May 26, 2009

ఆనగనగ ఒక వ్యయామశాల

"అది ఒక నంధన వనము..బుబు బ ..బుబు బ"...అని అడవి దొంగ పాటను మనస్సులో పాడుకుంటుంటే...నా కర్ణ భేరి లొపలినుంచి పగిలి బైటికి చిమ్మినటైంది. నా గురించి చెప్పుకోలెనతువంతి వాతిలొ నా గాత్రం ఒకటి. ఇక ఆ రోజు యెధేఛగా వ్యాయామశాల కు వెల్లిన. ఎంతైన ఒంటరి బ్రహ్మచారి ని కదా, కండరాలు మెత్త బడకుండ వుండెందుకు నా అవస్థలు నావి. మొదట 20 నిమిషాలు పరిగెత్తి కొంచెం సేద తీర్చుకుంటున్న నాకు, హఠాత్తుగ తలుపు దగ్గర ఏదొ భరువైన శబ్ధం వినిపించి అటు వైపు చుసినాను. కిడ్నాప్ చెసిన సమయాల్లొ కూడ గాడ నిద్ర లోకి జారుకునెంత దైర్యం వున్నా, ఆ రొజు నాలొని అనువనువు నరాల బలహీనత కు గురైంది.

ఒక జీవి...బ్రౌను చెర్రీ పాలిష్ ని బ్లాక్ షు కి కొడితె ఏ రంగు వస్తుందో, ఆ రంగు లొ వున్నాడు. అంతర్జ్యాతీయ క్రీడకారుల కొసం జబ్బలు కనిపిస్తూ తయారు చెసినటువంటి యెర్రటి ఇటుకల పొడి పుసినట్టు శరీరానికి అతుక్కొని వున్నాయి ఆ దుస్తులు....మెడ చుట్టు ఐపోడ్ వైర్లు...దానికి తోడు గా తల ని 2 సార్లు ముందుకు 1.5 సార్లు పక్కకి ఆడిస్తు...బలి కి సిద్థంగ వున్నటువంటి దేవర దున్న లా కనిపించినాడు. నోట్లొ ఒక చివింగ్ గమ్ స్పెషల్ ఎఫ్ఫెక్ట్. ఫుట్ బాల్ క్రీడా కారులు లాగ దరిదాపు మొకాలి వరకు సాక్సులను లాగి వెసుకున్నడు ఆ ప్రబుధుడు. అది చూస్తె, డేవిడ్ బెఖామ్ కు కచ్ఛితంగ ఈర్ష కలగక మానదు. చేతిలొ ఒక వాటర్ సిప్పర్ ...అందులొ బలం కొసం గ్లుకోస్ కలిపి వుందని ఆ సబ్బు నీటి రంగు చెప్తోంది. తల పైన అదెదో డిప్ప లేని టోపి ఒకటి పెట్టుకొని...అందరిని చీప్ గా చూస్తు...అల ఇల ఒల్లు విరుచుకొని నడుస్తుంటె...పాత సినిమాల్లొ చాథి పైన ఒక్క వెంట్రుక కూడా లేకుండ, నున్నగ జిలెట్ మాఖ్3 రేజర్ తొ షేవ్ చెసుకొని కత్తి యుద్ధం చేస్తున్న రాజనాల గారు గుర్తొచ్చినారు.

నాకు ఒక్క సారి భయం తొ...థ్రేడ్ మిల్ పైన ఎక్కడికైన పరిగెత్తి పొవాలని పించింది. సైజ్ కొంచెం భారి గనె వున్నదు...కాని చెతులు కాళ్లు సన్నగున్నాయి. పొట్ట ని చూస్తె మాత్రం...బర్గెర్స్, పిజ్జస్, "వి.ఐ.పి" ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమె తన ఆహరం గ బావించి..ఈ మధ్యనే ఆన్సైట్ నుంచి వచ్చిన వాడని ఇట్టె గ్రహించవచ్చు. నునూగు మీసాలకు అడవి తేనె పూసుకొని పడుకున్న తర్వత..రత్రిల్లొ ఆ మీసాలను జిట్టలు కొడితె ఎలా వుంటుందొ అలా వున్నయి అతని మీసాలు. ఆల్ఫ్రెడ్ హిత్చ్ కాక్ + విటలా చార్య లిద్దరు ఒక జాన పద హొర్రొర్ సినిమ తీస్తె అందులొ మాంత్రికుని పక్కన వుండి, దివిటిని తల పైన పెట్టుకొని తిరిగే అర్థం కాని జీవి పాత్రకు ఈ యుగ పురుషుడు ఎకగ్రీవంగా ఎన్నిక కాగలడనడం లొ అతిశయోక్తి లేదు.

తన పొట్ట ని కవర్ చెసుకుంటు..ఊపిరిని బిగ పెట్టి థ్రెడ్ మిల్ మీదకెక్కి టెంపో ని లెవెల్ 14 కి పెట్టి తనని ఎవరన్న చుస్తున్నార లెద అని చుట్టూ ఒక లుక్ ఇచుకున్నడు. ఎవరు చుడట్లెదు అని పిల్లి పాలు తాగుతున్నట్టు ఈ గ్రహంతర వాసి జాగింగ్ చెయటం మొదలు పెట్టినాడు. వెను వెంటనె తదుపరి 15 సెకండ్లకి కి అంత టెంపొ ని లెవెల్ 4 కు తగ్గించేసి... వెంట తెచుకున్న ఫ్లాస్క్ లొంచి గ్లుకోస్ నీళ్ళను బుర్ర్ర్ మంటు తాగినాడు. ఈ సారి మాత్రం తనని ఎవరన్న చుస్తున్నార లెద అని ఎందుకో చుడలేదు. అలా లెవెల్ 4 లో ఇంకో 1:15 నిముషాలు పరిగెత్తి ...మారథాన్ విజెత లాగ గస పడుతు థ్రెడ్ మిల్ ని దిగేసినాడు.

తదుపరి సీన్ : బెంచ్ ప్రెస్స్ అనబడె యెంత్ర సామాగ్రి దగ్గరికి వచినాడు. అప్పటికె నేను మానసిక పరిపక్వత చెందని గుద్ల గూబ లాగ..360 డెగ్రీ కొణం లో నా తల వెనక్కి తిరగడం మొదలైంది. బెంచ్ ప్రెస్స్ పైన చెరోపక్క 25-25 కే.జి ల ప్లేట్లు వున్న రాడ్ కు రామయణం లో రాముదు శివధనస్సుని ఉఫ్ ఇంతెన అన్న ఒక లొక్ ఇచినట్టు ఇచ్చి...ఆ ప్లేట్ల ను విడిపోకుండ పట్టి వున్న మేట ని విప్పడం మొదలెట్టినాడు. ఇంకెంత బరువును వెస్థాడొ అని నాకు లొపల కట్టుకున్న లంగోట ఇంచుమించు తదిసి మొపడయింది. ఆ 25-25 ప్లేట్లను తీసి పక్కన పెట్టి...తన పొట్ట లోని గాలినంతటిని కష్టపడి ఛాథి లోకి పంపించి వెల్లలికలుగా పడుకొని వుత్త రాడ్ ని మాత్రమే ఎత్తడం..మొదలైంది. ఈ ద్రుష్యం చుస్తున్న నేను సీసంగుండు ను సాల్డెరింగ్ రాడ్ తో కరిగించి, కంట్లొ పొసుకుందాం అనుకున్న.

తట్టుకోలేక నా అంతర్గత పరివర్తనము ఇంచుమించు పగిలిపోయెంత పని అయ్యింది. 6 సార్లు ఎత్తి దించగానె...ఆ రాడ్ ఎత్తడం లొ కొంచెం సహాయం చేయమని ఆ పక్కనున్న వాడిని లిఫ్ట్ అడిగినాడు...!! ఇల బెంచ్ ప్రెస్ మీద 2 సెట్ లు పూర్తి చేసినాక డంబెల్స్ రాక్ దగ్గరికి వచ్చినాడు. అప్పుడె ఒక అమ్మాయి రాక్ లొ పెట్ట బోతున్న 2.5 కి.లొ. డంబెల్స్ ని.. "YESKEESME CAN I DO" అని ఫేక్ ఎక్సెంట్ తొ ఆ అమ్మయిని అడిగినాడు మన యొ-మాన్. ఇంగ్లిష్ మీడియం కాబొలు అందుకే ఈ స్టైలు. "CAN I DO" ఆ,...?? నీకు "డు" అంత సీను లెదులేరా పుస్కీ అనుకుంటు...ఆ కోల మొఖం అమ్మయి పెట్టిన సొట్ట మూతి ని చూస్తె...మామిడి పండు కూడ చిన్న బోవాల్సిందె. ఎట్లైతెనేం ఆ అమ్మయి దగ్గర నుంచి ఆ 2.5 కి.లొ. డంబెల్స్ ని తేసుకున్నాడు. ఈ డుంబెల్స్ తొ ఏ కసరత్తు చేస్తాడ అని ఇక్కడ నేను నరాలను బిగపట్టి కాచుకొని వున్న. నాసామి రంగ అప్పుడు చుడాలి ఆ ద్రుశ్యం...సైడు కు తిరిగి గొడకున్న అద్దాలల్లొ తన దెహాన్ని అభినందిస్తు ఆ 2.5 కి.లొ. డంబెల్స్ ని ఎత్తడం మొదలు పెట్టినాడు. నొట్లొ చివింగ్ గం...ఇయర్ ఫొన్స్ లొ మ్యుజిక్...తల వూపుడు మాత్రం మానలేదు..!! 8 సార్లు ఎత్తి...డంబెల్స్ ని ఎడమ చేతిలొకి తీసుకొని ఇంకొ 10 సార్లు ఎట్లొ కస్టపడి ఏదొ చేసినాడు. అయిపోయిన వెంటనె...ఆమిర్ ఖాన్ ఘజిని ప్రోమొ పోస్టెర్ లొ లాగ చెతులను మడిచి కండరాలు ఎంత పెరిగి పోయినాయొ నని అద్ధం లొ చూసుకొవడం మొదలు పెట్టినాడు. దినిని చుసిన నాకు, ఒంట్లో ని కరెంట్ కి షార్ట్ సర్క్యూట్ అయ్యి గిజ్ జ్ జ్....మని షాక్ కొట్టడం మొదలైంది.

"ఆచార్య...తమరెవరు....తమరిది ఏ గ్రహం"..?? అని వెళ్ళి అడుగుదాం అనుకుంటు తన దగ్గరికి ఒణుక్కుంటూ నడవడం మొదలు పెట్టిన. అడిగెందుకు నోరు విప్ప బోయె సమయనికి ..తన సెల్ ఫొన్ రింగ్ అయింది. రింగ్ టోన్ వచ్చి "కన్నుం కన్నుం నోకియ, నీ కొల్లై కొల్లుం మఫియ... కేప్పచ్చినో కాఫియా...సొఫియా" అనే పాత జిమ్మ్ అంతా విన పడెంత గ మొగింది. మన హీరొ గారు..."ఎన్న మచ్చ...సొల్లు..నాన్ జిమ్మ్ లె ఇరుక్కె, నీ నల్లా ఇరికియా"...అని ఫొనె లొ అరిచినాడు. ఎం ఇరుక్కుని వుందొ తెలీదు కాని..ఒక్క సారి మేటెర్ అంత కళ్ళకు కట్టినట్టుగా అర్థం అయ్యి... విప్ప బోయిన నోరును దబ్బనం తో కుట్టెసుకున్న. మైండ్ లొ ctrl+alt+del నొక్కి..కాశిమజిలి కథలొ దెయ్యం మర్రి చెట్టు కొమ్మలతొ పిలుస్తున్న వెనక్కి తిరగని బాల రాజు వలె...ఇపుడె కక్కుకున్న తర్వత వచ్చె పుల్లని అజీబ్ గలీజ్ ఫీలింగ్ తొ జిమ్మ్ నుంచి నేను వెనువెంటనె ఎస్కేప్ కొట్టిన.

ఇది చదివిన మీరందరూ నల్లా ఇరుక్కే...ఇదంత చుసిన నేను మాత్రం ఇంకో రకంగ నల్లగా కాలి పోయి ఇరుక్కే...!!